వైయస్ జగన్ సాక్షి కథనాలపై పయ్యావుల కేశవ్ ఫైర్

జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ న్యాయమైనవే అయితే ఆ కంపెనీ ప్రతినిధులు ఎందుకు ముందుకు రావడం లేదని, వారు బయటకు వచ్చి అన్ని విషయాలు చెప్పవచ్చు కదా అని ఆయన అన్నారు. పెట్టుబడిదారుల గురించి ఐటి శాఖ అడుగుతున్న ప్రతిసారీ జగతి పబ్లికేషన్స్ వివరాలు అందిస్తూ వచ్చిందని ఆయన అన్నారు. ఐటి శాఖ ఆ సంస్థలకు రాసిన లేఖలు తిరిగి వస్తున్నాయని, వాటికి కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేదని ఆయన అన్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. జగతిలో పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టినవారంతా జగన్ బంధువులు, మిత్రులు, సన్నిహితులేనని ఆయన అన్నారు. తాము రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంలో వారందరి పేర్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
జగతి పబ్లికేషన్స్ నష్టాల్లో ఉందని ఆదాయం పన్ను శాఖ చెబుతోందని, అటువంటప్పుడు భారీ పెట్టుబడులు ఎలా వస్తాయని ఆయన అన్నారు. కేవలం 8 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన జగన్‌కు 90 శాతం వాటా ఉంటే, 1200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినవారందరికీ కేవలం పదిశాతం వాటా మాత్రమే ఉందని, ఇది జగన్ కార్పోరేట్ మాయాజాలమని ఆయన అన్నారు. విజయసాయి రెడ్డికి తమ నుంచి ఏ విధమైన ముప్పు లేదని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో చివరి నిందితుడి వరకు హత్యకు గురి కావడంతో జగన్ కేసులో కూడా అలాగే జరిగే ప్రమాదం ఉందని తాము అనుమానాలు వ్యక్తం చేశామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications