అబ్దుల్ కలాంకు అమెరికా ఎయిర్ పోర్టులో అవమానం

APJ Abdul Kalam
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్దుల్ కలాంకు అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అవమానం ఎదురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎనభయ్యేళ్ల కలాం ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు రెండుసార్లు కలాంను ఒళ్లంతా తడిమి చూసే ప్రయత్నాలు చేశారు. ఓ కార్యక్రమానికి హాజరై గత సెప్టెంబర్‌లో ఆయన తిరిగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో న్యూయార్కు ఎయిర్ పోర్టు అధికారులు ఆయన ఒళ్లంతా తడిమి చూసే ప్రయత్నాలు చేశారు. అయితే ఎయిరిండియా ప్రతినిధులు అభ్యంతరం చెప్పారట. అయినప్పటికీ వారు కలాం బూట్లు, కోటు విప్పి తనిఖీలు చేశారు.

అయితే భారత దేశానికి రాష్ట్రపతిగా పని చేసినటువంటి, భారతరత్న అయిన కలాంను తనిఖీలు చేయడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకుగాను అమెరికా క్షమాపణ చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాగా 2009లోనూ న్యూఢిల్లీలో కలాంను పూర్తిగా తనిఖీ చేసి ఓ ఎయిర్ లైన్స్ అధికారులు అవమానపర్చారు. ఇలాంటి సంఘటన ఆయనకు ఎదురుకావడం ఇది రెండోసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+