వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొంతు నొక్కేస్తున్నారు: పరకాల, జయశంకర్‌పై వ్యాఖ్యలకు నిరసన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parakala Prabhakar
హైదరాబాద్: మా గొంతు నొక్కేయడానికి కొందరు తమపై దాడి చేశారని విశాలాంధ్ర మహా సభ నేత పరకాల ప్రభాకర్ ఆదివారం అన్నారు. ఓ ఛానల్ చర్చా కార్యక్రమం సందర్భంగా టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర రావు తన నియోజకవర్గం వికారాబాద్ వచ్చి సమైక్యాంధ్ర ఉందని నిరూపించాలని పరకాలకు సవాల్ విసిరారు. ఈ విషయమై ఆదివారం జూబ్లీహిల్స్‌లో ఇద్దరు భేటీ కావడం ఆ తర్వాత ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పరకాల మాట్లాడారు. తాను మాజీ మంత్రి మాటలు నమ్మి వచ్చానని అయినప్పటికీ తనపై దాడి జరిగిందన్నారు. భావస్వేచ్ఛ కలిగిన భారత దేశంలో మనం ఉంటున్నామని తనకు తన అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందన్నారు. అభిప్రాయాలు వెల్లడించవద్దంటే టిఆర్ఎస్ ఫత్వా జారీ చేయాలని విమర్శించారు. తన అభిప్రాయంతో విభేదించినప్పటికీ తనకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు.

టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా ఉండటానికి ఇలా దాడి చేశారన్నారు. తనకు రక్షణ కల్పిస్తానని చెప్పిన మంత్రి సమక్షంలోనే దాడి జరగడం గర్హనీయమన్నారు. కాగా ఆచార్య జయశంకర్ పైన పరకాల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడ్డారు. తెలంగాణకు సంబంధించి జయశంకర్ చెప్పిన కట్టుకథలు ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన విశాలాంధ్ర మహా సభ సమావేశంలో పరకాల మాట్లాడుతూ జయశంకర్ పచ్చి అబద్దాలు చెప్పారని నిర్ద్వంధంగా నిరూపించిన వ్యక్తి నల్గొండకు చెందిన వారని, ఆయన చెప్పినవి ప్రజల్లోకి వెళితే ప్రజలు తిరగేసి కొడతారనే వారు అడ్డుకుంటున్నారని టిఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు.

English summary
Vishalandhra Maha Saba leader Parakala Prabhakar condemned TRS attack on him today. He said he have right to told his opinon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X