హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి కేసు: వారంపాటు సిబిఐ కస్టడీకి రాజగోపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో గనుల శాఖ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్‌ను వారం రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ గనుల తవ్వకంలో ఇద్దరు ముద్దాయిలు గాలి జనార్దన్ రెడ్డికి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డికి రాజగోపాల్ సహకరించారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన వివరాలను రాబట్టడానికి రాజగోపాల్‌ను 13 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. అయితే, వారం రోజుల పాటు ఈ నెల 21వ తేదీ వరకు రాజగోపాల్‌ను సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గనుల అక్రమ తవ్వకాల కేసులో రాజగోపాల్ మూడో ముద్దాయి.

న్యాయవాది సమక్షంలోనే రాజగోపాల్‌ను ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. రాజగోపాల్ బంధువు ఒకతను ఒఎంసిలో పనిచేస్తున్నాడని, దాంతో రాజగోపాల్ ఒఎంసికి అనుకూలంగా పని చేశాడని, కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసి ఒఎంసికి అనుకూలంగా వ్యవహరించాడని సిబిఐ ఆరోపించింది. తమ క్లయింట్‌ను సిబిఐ వేధిస్తోందని రాజగోపాల్ తరఫు న్యాయవాది ఆరోపించారు. రాజగోపాల్‌ను తమ కార్యాలయానికి పిలిపించి పలు మార్లు విచారించిందని, వాటిని రికార్డు కూడా చేయలేదని ఆయన అన్నారు.

కాగా, గాలి జనార్దన్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు తమకు అప్పగించాలని సిబిఐని ఆదేశించాలని ఆదాయం పన్ను శాఖ కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదిలా వుంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్‌కు ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడిషిటల్ కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు కోనేరు ప్రసాద్‌ను సోమవారం కోర్టులో హాజరు పరిచారు.

English summary
Court ordered to handovering Rajagopal to CBI custody in Gali Janardhan Reddy's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X