ఎవరికీ భయపడేది లేదు: టిడిపి అధినేత బాబు

రైతు సమస్యలను పట్టించుకోని చేతగాని, సిగ్గులేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి నైతిక స్థయిర్యాన్ని, భరోసాను ఇవ్వడమే తన రైతు పోరు బాటు లక్ష్యమని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో రైతు పోరు బాటును ముగించుకున్న ఆయన మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు రైతు పోరు బాటు కొనసాగుతుందని ఆయన చెప్పారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఆముదాలవలసలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లి చంద్రబాబు ఇటీవల వివాహమైన ఆయన కూతురు, అల్లుడిని ఆశీర్వదించారు. రైతులను చైతన్యపరిచి ఉద్యమానికి సమాయత్తం చేయడమే తన ఉద్దేశ్యమని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications