బాబు సహకరించాలి, సిఎం నేర్చుకోవాలి: కోదండరామ్

కాంగ్రెసు పార్టీ తెలంగాణపై కమిటీ, కమీషన్ల పేరుతో కాలాయాపన చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు సిద్దిపేటలో యాత్ర ప్రారంభం సందర్భంగా అన్నారు. పాదయాత్ర ద్వారా కాంగ్రెసు వైఖరిని ఎండగడతామని చెప్పారు. తనపై స్థానిక పోలీసు అధికారులు పిడి యాక్టు క్రింద కేసు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నా చేసిందేమీ లేదన్నారు.
జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల వల్ల కాలుష్యం తప్ప ఉద్యోగాలు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు.












Click it and Unblock the Notifications