స్పీకర్‌ను సమయం కోరిన ఇద్దరు శాసనసభ్యులు

Nadendla Manohar
హైదరాబాద్: తమ రాజీనామాలపై హాజరు కావడానికి కొంత సమయం ఇవ్వాలని శానససభ్యులు సోమారపు సత్యనారాయణ, రాజయ్య స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. రాజీనామాలు చేసిన శాసనసభ్యులతో చర్చించే క్రమంలో స్పీకర్ వారిద్దరిని తన ముందు రేపు గురువారం తన ముందుకు రావాలని సూచించారు. అయితే, తమకు కొంత సమయం కావాలని వారు స్పీకర్‌తో చెప్పారు. తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇచ్చిన పిలువు మేరకు పాదయాత్రల్లో పాల్గొంటున్నామని, అది పూర్తయిన వెంటనే హాజరవుతామని వారు స్పీకర్‌తో చెప్పారు. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి సోమారపు సత్యనారాయణ, రాజయ్య తెరాసలో చేరారు. అదే సమయంలో వారు తమ శాసనసభా సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు.

డిసెంబర్ 1వ తేదీన శానససభా సమావేశాలు కానున్న నేపథ్యంలో అప్పటిలోగా తన వద్ద పెండింగులో ఉన్న రాజీనామాలను పరిష్కరించాలని స్పీకర్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే ఇద్దరు శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరిన శాసనసభ్యుల రాజీనామాలను ముందు పరిష్కరించే పనిలో స్పీకర్ పడినట్లు కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన సోమారపు సత్యనారాయణ, రాజయ్య స్పీకర్ ముందు హాజరై తమ రాజీనామాలను ఆమోదించాలని కోరే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+