జగన్‌తో కాంగ్రెసు మూడు ఒప్పందాలు: టిడిపి

జగన్, ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య మూడు రహస్య ఒప్పందాలు జరిగాయన్నారు. ఒకటి జగన్ విచారణ క్రమంగా నీరుగార్చడం, రెండు చంద్రబాబు ప్రతిష్ట దిగజార్చడం, మూడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసులో విలీనం వారి మధ్య కుదిరిన ఒప్పందాలన్నారు. కాంగ్రెసు డైరెక్షన్‌లోనే జగన్ పని చేస్తున్నారన్నారు. జగన్ ఆస్తులపై విచారణ జరిపే ముందు ఇరువర్గాల వాదనలు విన్నారని కానీ బాబు వాదనలు వినకుండానే విచారణకు ఆదేశించారన్నారు.
మా వాదనలు వినలేదనే అభిప్రాయం మాలో ఉందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చంద్రబాబుకు లేదని అయితే దీనిపై మరోసారి భేటీ అవుతామన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా పని చేస్తున్నందు వల్లే బాబును బద్నామ్ చేయాలని చూస్తున్నారన్నారు. జగన్, కాంగ్రెసు రహస్య ఒప్పందంపై తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. సిబిఐ విచారణకు తాము భయపడటం లేదన్నారు.












Click it and Unblock the Notifications