లగడపాటితో కలిసి భోంచేసిన తెలంగాణ ప్రాంత నేతలు

కాగా సమావేశం అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంపై సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరకాల ప్రభాకర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రం సామరస్యంగా విడిపోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. స్పీకర్ చర్చలకు పిలిస్తే తమ రాజీనామాలు ఆమోదించమని కోరతామని చెప్పారు. అయితే స్పీకర్ నుండి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. సమావేశం అనంతరం కెకె, వివేక్ మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications