న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైయస్ చైర్మన్ విజయసాయి రెడ్డికి శనివారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విజయసాయి రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. జగన్ ఆస్తుల కేసుపై సిబిఐ విచారణలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని కోరుతూ విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ జోక్యం లేకుండా సిబిఐకి ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి, స్వయంప్రతిపత్తి కోరుతూ విజయసాయి రెడ్డి ఆ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ అంశాలను హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది.