విజయమ్మ పిటిషన్ వైయస్ ప్రాజెక్టులపైనే: యనమల

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి ఆమోదముద్ర వేసిన మెగా ప్రాజెక్టుల్లోనే అవకతవకలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్ వేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై తమ పార్టీని బెదిరించడానికే పిటిషన్ వేశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష పేరిట వైయస్ రాజశేఖర రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కాంట్రాక్టు పొందిన జిఎంఆర్ నుంచి వైయస్ 50 కోట్ల రూపాయలు తీసుకుని అదనపు రాయితీలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి సత్యాలను అసత్యాలుగా చూపి, అధికారంలోకి వచ్చిన తర్వాత ధనదాహం తీర్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆమోదం పొందిన 64 మెగా ప్రాజెక్టులపై ఆరోపణలు చేసిన వైయస్ తాను అధికారంలోకి రాగానే కేవలం నాలుగింటిన మినహాయించి అన్ని మెగా ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసి అదనపు లబ్ధిని చేకూర్చారని ఆయన అన్నారు. అది వైయస్ తప్పు కాదా అని ఆయన అడిగారు.

చంద్రబాబు హయాంలోని మెగా ప్రాజెక్టులపై విచారణ చేపట్టాలనుకుంటే అది చంద్రబాబుపై చేపట్టకూడదని, అవే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసిన వైయస్ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు రోశయ్య, గీతారెడ్డిపై విచాణకు ఆదేశించాలని ఆయన అన్నారు. వైయస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందింది వైయస్ విజయమ్మ కుమారుడు వైయస్ జగన్ మాత్రమేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+