నా ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లను: చంద్రబాబు

సిబిఐ సంస్థ కాంగ్రెసు జేబు సంస్థగా మారిందని ఆయనవిమర్శించారు. రైతు పోరు బాట యాత్ర అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి వచ్చిన ఆనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఉంటేనే సరియైన న్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యర్థులను వేధఇంచేందుకు సిబిఐని కాంగ్రెసు పార్టీ వాడుకుంటుందని విమర్శించారు. అన్ని సంస్థలలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించాలని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. సిబిఐ, రైతు సమస్యలపై జాతీయ స్థాయి నేతలతో చర్చించేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. కాగా రెండు రోజుల పాటు బాబు ఢిల్లీలోనే ఉండనున్నారు.












Click it and Unblock the Notifications