హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూల్‌డ్రింక్స్ బాటిళ్లతో కొట్టి పరిటాల అనుచరుడి హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

ranga reddy
హైదరాబాద్: దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర అనుచరుడు దాసరి యాదగిరిని పాతకక్షల కారణంగా ప్రత్యర్థులు ఆదివారం సాయంత్రం దారుణంగా హతమార్చారు. ఆగంతకులు వరంగల్ జాతీయ రహదారిపై వెంబడించి తల్వార్లు, కూల్‌డ్రింక్ బాటిళ్లు, ఇనుపరాడ్లతో హత్య చేశారు. నగరంలోని లాలాపేటకు చెందిన దాసరి యాదగిరి(45) టాటా సఫారీ వాహనంలో ఆదివారం నల్గొండ జిల్లాలోని బీబీనగర్‌లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తున్నాడు. ఘట్‌కేసర్ పెట్రోల్ బంక్ సమీపంలో దాడికి యత్నించారు. విషయాన్ని గమనించిన యాదగిరి వాహనం దిగి పారిపోతుండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పక్కనగల బేకరీ ఎదుట అడ్డుకుని హత్యచేశారు.

ఈ హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లుగా మృతుడి బంధువులు చెబుతున్నారు. ఆగంతకులు ముందస్తు పథకం ప్రకారం యాదగిరి వాహనాన్ని పంచరయ్యే విధంగా ప్లాన్ చేసి దాడికి పాల్పడ్డారు. దీంతో దాడి నుంచి తప్పంచుకునే ప్రయత్నంలో మృతుడు కొంతదూరం పరుగెత్తినప్పటికీ ఆగంతకులు పట్టుకుని హత్య చేశారు. మృతుడు ఫైనాన్స్ వ్యాపారంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల బంధువులకు సంబంధించిన ఓ వివాదంలో యాదగిరి ఓ వర్గం వైపు నిలవడంతో మరోవైపు వారు కక్ష కట్టి ఈ హత్యకు పాల్పడినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు.

మృతుడిపై హత్య కేసులు ఉన్నట్లు సమాచారం. స్థిరాస్తి, ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న యాదగిరి ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి రెండు రోజుల క్రితమే విడుదలైనట్లుగా సమాచారం. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పరిటాల అనుచరుడైన యాదగిరికి ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధం లేదని కేవలం కుటుంబ తగాదాల వల్లనే హత్య జరిగినట్లుగా పోలీసులు
చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి ఏసీపీ రాధాకిషన్‌రావు సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నట్లు ఘట్‌కేసర్ సీఐ శ్రీకాంత్ తెలిపారు.

English summary
Former minister Paritala Ravi's aide D. Yadagiri was murdered on the road near the Ghatkesar petrol pump on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X