ప్రాణం తీసిన అసభ్య మెసేజ్‌‍లు, జిల్లాల్లో ముగ్గురు బలి

Guntur District
గుంటూరు/నల్గొండ: గుంటూరు జిల్లాలో అసభ్య ఎస్సెమ్మెస్‌ల కారణంగా ఓ వివాహిత మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని చంద్రమౌళి నగర్‌లో ఉంటున్న ఓ వివాహితకు స్థానికంగా ఉండే ఓ కానిస్టేబుల్ తరుచూ అసభ్యంగా ఉండే ఎస్సెమ్మెస్‌లు పంపించే వాడు. సదరు కానిస్టేబుల్ తీరు రోజు రోజుకు శృతిమించడంతో ఆమె మనస్థాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఏడవ తరగతి విద్యార్థి సెల్ ఫోన్ దొంగతనం చేయడంతో ప్రిన్సిపల్ అతనిని తీవ్రంగా చితకబాదాడు. అందరి ముందు దొంగతనం చేశాడంటూ ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఆకతాయి వేధింపులకు ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థిని బలైంది. వైరా మండలం గరికపాడుకు చెందిన నర్మద డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా ఓ యువకుడు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. అవి ఎక్కువ కావడంతో మనస్థాపం చెందిన ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+