వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ విగ్రహం ముందు టి-కాంగ్రెసు ఎంపీల ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నాకు దిగారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే పదిహేను నిమిషాల ముందు టి-కాంగ్ ఎంపీలు గాంధీ విగ్రహం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. వి వాంట్ తెలంగాణ, కేంద్రం తెలంగాణ వెంటనే ప్రకటించాలని నినాదాలు చేశారు. మంగళవారం నుండి సమావేశాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా సోమవారం రాత్రి ఎంపీలు వివేక్ ఇంట్లో భేటీ అయి సభలో చేయాల్సిన అంశంపై చర్చించారు.

రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతించారు. మాయావతి నిర్ణయం తెలంగాణకు ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణపై స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇస్తానని చెప్పారు. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తెలంగాణపై వాయిదా తీర్మానం ఇచ్చింది.

English summary
Telangana Congress MPs make stir at Mahatma Gandhi statue at parliament and demanded for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X