వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనేరు ప్రసాద్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Koneru Preasad
హైదరాబాద్: తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించి, తనకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ వేసిన పటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. షరతులతో కూడిన బెయిల్‌పై శబరిమల వెళ్లి వచ్చిన ప్రసాద్ ఈ నెల 22వ తేదీన సిబిఐ కోర్టు ముందు లొంగిపోయారు. డిసెంబర్ 2వ తేదీ వరకు కోర్టు ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించింది. తనను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

అండర్ ట్రయల్ ఖైదీగా కోనేరు ప్రసాద్ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉంటున్నారు. శ్రీకాకుళంలో హెవీ మెటల్స్ తయారు చేస్తున్న రెండు కంపెనీలు ట్రైమెక్స్ శాండ్స్, ట్రైమెక్స్ ఇండస్ట్రీస్‌లకు తాను డైరెక్టర్‌గా ఉన్నానని, వివిధ దేశాల్లోని కంపెనీలతో కలిసి తాను పనిచేస్తున్నానని, తాను 2009 వరకు దుబాయ్‌కి చెందిన ఎన్నారైనని, ప్రస్తుతం భారత్‌లో స్థిరపడ్డానని ఆయన తన పిటిషన్‌లో చెప్పుకున్నారు. తన సంపన్నమైన జీవశైలిని, ఆరోగ్యకారణాలను చూపుతూ తనను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించాలని ఆయన కోర్టును కోరారు.

English summary
Nampally Court reserved its decission on Koneru Prasad's petition, filed seeking special class prisiner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X