మావోల నేత కిషన్‌జీని చుట్టుముట్టిన భద్రతా బలగాలు

కిషన్‌జీని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని భద్రతా బలగాలకు చెందిన అధికారులు చెబుతున్నారు. అడవిలో కిషన్‌జీ, సుచిత్రో మహతో ఉన్నట్లు సమాచారం ఉందని అంటున్నారు. కిషన్‌జీని పట్టుకోవడానికి అదనపు బలగాలను కూడా రప్పిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ మావోయిస్టులపై కత్తి కట్టారు. అంతకు ముందు వారితో మమతా బెనర్జీకి సన్నిహిత సంబంధాలుండేవనే విమర్శలున్నాయి. మావోయిస్టులపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మమతా బెనర్జీని మావోయిస్టులు టార్గెట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కిషన్‌జీ ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లాకు చెందినవాడు.












Click it and Unblock the Notifications