హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఐఏఎస్‌లకు ఉరే సరి: మరో మైనింగ్ వ్యాపారి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sri Lakshmi
హైదరాబాద్: గనుల శాఖ మాజీ అధికారి రాజగోపాల్, ఐఏఎస్ అధికారణి శ్రీలక్ష్మిల అక్రమాలపై రోజుకో కొత్త కంపెనీ సిబిఐ ముందుకు వస్తోంది. వారు ఓఎంసిలోనే కాకుండా మిగిలిన ఇతర మైనింగ్‌లోనూ అక్రమాలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం రీటా ఇండస్ట్రియల్ కార్పోరేషన్ లిమిటెడ్ సిఎండి అమరేందర్ రెడ్డి సిబిఐ వద్దకు వచ్చి శ్రీలక్ష్మి, రాజగోపాల్ అక్రమాల పైన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడారు.

వారిద్దరు అధికారులు మైనింగ్ డిపార్టుమెంటును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈ పరిశ్రమలో చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఇలాంటి అక్రమాల ఆఫీసర్లను చూడలేదన్నారు. ఇలాంటి అక్రమ అధికారులు ఉంటే ఎన్నారైలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. వారికి బహిరంగ ఉరి శిక్షే సరైనదన్నారు. వారికి జీవించే హక్కు లేదన్నారు. గనుల అక్రమాలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ మైనింగ్ కోసం అమరేందర్ రెడ్డి కంపెనీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ దానిని ఎపిఎండిసికి రిజర్వ్ చేసినట్లు నమ్మబలికి వారికి అనుకూలురైన వారికి ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సాక్ష్యాలు కూడా చూపించేందుకు మైనింగ్ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. పదుల ఎకరాల మైనింగ్ తమకు అనుకూలురైన వారికి వారు ధారాదత్తం చేశారని ఆరోపిస్తున్నారు.

English summary
Rita Industrial Corporation Limited CMD Amarendhar Reddy accused that Srilaxmi and Rajagopal must hang for their illegal activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X