హైకోర్టుకు చంద్రబాబు ఫ్యామిలీ, టిడిపి నేతలు కూడా

తాను అధికారంలో ఉండగా కాంగ్రెస్ నేతలు తనపై 24కేసులు వేశారని, వాటన్నింటినీ కోర్టు లు కొట్టేశాయని, ప్రతిపక్షంలోకి వచ్చాక 26రకాల విచారణలు జరిపారని, ఒక్క తప్పూ తేల్చలేకపోయారని, ఇప్పుడు పాతవన్నీ కలగలిపి మళ్లీ కోర్టుకెక్కారనిస దీనికి ఒక విధానమంటూ ఉండదా, జీవితాంతం ఈ విచారణలను ఎదుర్కొంటూ తిరగాల్సిందేనా, ఏం చేయాలో చెప్పాలని కోర్టునే అడగాలనుకుంటున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన గురువారం కొందరు పార్టీ నేతలతో తన మనోభావాలను పంచుకొన్నారు.
తాను ఎలా నిర్ణయాలు తీసుకున్నానో, తన తర్వాత వచ్చిన వారు ఎలా నిర్ణయాలు తీసుకున్నారో అన్నింటికీ ప్రభుత్వం వద్దే సాక్ష్యాలున్నాయని, తాను తప్పుచేస్తే చర్యలు తీసుకోకుండా ఎవరు ఆపారని, వైఎస్‌లాగా దోచిపెట్టలేదని తన బంధువులు, మిత్రులు, పార్టీలోని వారు ఇప్పటికీ నిందిస్తుంటారని, కానీ తానేదో దోచి పెట్టానంటూ నాపై కేసుల మీద కేసులు దాఖలవుతున్నాయని, ఈ విషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నానని అన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications