ఐటి పత్రాలపై 28కి వాయిదా పడిన జగన్ కేసు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమ ఆస్తులు, సాక్షి మీడియాలో పెట్టుబడులపై సీబీఐ విచారణలో సేకరించిన పత్రాలను ఆదాయపన్ను శాఖ (ఐటి శాఖ)కు ఇవ్వాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. జగన్ వేసిన పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. తాము స్వాధీనం చేసుకున్న పత్రాలను ఇప్పటికే ఐటి శాఖకు ఇచ్చేశామని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.

తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సీబీఐ సేకరించిన వివరాలను ఐటీ శాఖకు ఇవ్వాలని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశించడం సరికాదని జగన్ తన పిటిషన్‌లో అన్నారు. సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని నిబంధనల ప్రకారం ఒక కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన వివరాలను మరో శాఖకు ఇవ్వకూడదని, అలా ఇవ్వాలన్న నిబంధనలేవీ చట్టంలో లేవని అప్పీలు పిటిషన్‌లో అన్నారు.

ఐటీ శాఖ తమకు ఏం కావాలో స్పష్టంగా కోరకుండా మొత్తం అన్ని పత్రాలు ఇవ్వాలని కోరడం న్యాయసమ్మతం కాదని, ఐటీ శాఖకు కేవలం ఆదాయవ్యయాలకు సంబంధించిన పత్రాలు మాత్రమే అవసరమవుతాయని పిటిషన్‌లో అన్నారు. ఆదాయేతర పత్రాలతో ఆదాయపన్ను శాఖకు పనేముంటుంది, తనను ఇబ్బందులు పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని పిటిషన్‌లో అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+