వైయస్ జగన్ వర్గంలో కోవర్టులు, ఎమ్మెల్యేల ఆందోళన

ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే విషయంపై వైయస్ జగన్‌తో చాలా మంది శానససభ్యులు విభేదించినట్లు చెబుతున్నారు. అవిశ్వాసానికి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టి మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ భావిస్తుండగా, అందుకు భిన్నంగా కొంత మంది శానససభ్యులు ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. అవిశ్వాసానికి మద్దతిస్తే తాము ఇబ్బందుల్లో పడుతామని కొంత మంది శానససభ్యులు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.
అదంతా ఒక ఎత్తయితే, సమావేశం వివరాలను కొంత మంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. దానివల్ల జగన్ నుంచి తమ వైపు ఇంకా ఎంత మంది రాగలరనే అంచనాకు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి వారిని తన వైపు లాగేందుకు తగిన వ్యూహాన్ని ఎంచుకోవడానికి అది ఉపయోగపడుతోందని, దాంతో సమావేశం నిర్వహించడం వల్ల ఇబ్బందులే ఎక్కువగా వచ్చాయని జగన్ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, జగన్ వర్గం పూర్తిగా ఒకే మాట మీద లేకపోవడమనేది పెద్ద ఇబ్బందిగా మారిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications