కిషన్‌జీ ఇతివృత్తంతో సినిమా తీస్తా: నారాయణమూర్తి

R Narayana Murthy
కరీంనగర్: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఇతివృత్తంతో తాను దండకారుణ్యం పేరుతో ఓ సినిమా తీస్తానని ప్రముఖ విప్లవ సినిమాల కథానాయకుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆదివారం కరీంనగర్‌లో ప్రకటించారు. పెద్దపల్లిలోని చందాపల్లిలో కిషన్‌జీ చితికి నిప్పు అంటించిన తర్వాత ఆర్ నారాయణ మూర్తి అక్కడకు చేరుకున్నారు. కిషన్‌జీ చితి చూసి ఆయన కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీడిత ప్రజల కోసం పాటుపడిన కిషన్‌జీని ప్రభుత్వం ఎన్‌కౌంటర్ చేయడం దారుణమన్నారు. అహర్నిషలు ప్రజల కోసం పాటుపడిన మల్లోజుల ఇతివృత్తంతో తాను చిత్రాన్ని తీస్తానన్నారు.

కిషన్‌జీ అంత్యక్రియలకు భారీగా ప్రముఖులు, ప్రజలు తరలి వచ్చారు. విరసం నేత వరవర రావు, ప్రజా గాయకుడు గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు వచ్చారు. ఎంపీ వివేక్ ఆయనకు నివాళులర్పించారు. కాగా కిషన్‌జీది ముమ్మాటికి హత్యేనని అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+