మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి

ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం ఉదయం 3.30 నిమిషాలకు చోటు చేసుకుంది. ఈ రెండు బస్సులు రాయల్ ట్రావెల్స్, సోని ట్రావెల్స్‌కు చెందినవిగా గుర్తించారు. ఇందులో ఓ బస్సు నాగపూర్ నుండి పూణే వెళుతుండగా మరో బస్సు నాగపూర్ వెళుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు.












Click it and Unblock the Notifications