గాలి జనార్ధన్‌రెడ్డి ఓఎంసి కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి అరెస్టు

ఓఎంసి కేసులో ఆమె ఎ-3 నిందితురాలిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో శ్రీలక్ష్మి పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శిగా పని చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, ఓఎంసి కంటే ముందు వేరే కంపెనీలు గనుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటిని పక్కకు పెట్టి గాలికి ఏకపక్షంగా 68.5 హెక్టార్ల గనులు కేటాయించారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు ఉన్నాయి. 2009లో ఎలాంటి సమీక్షలు లేకుండానే కొన్ని లీజులు మంజూరు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. వైయస్ హయాంలో గనుల కేటాయింపుల్లో ఈమెది ప్రధాన పాత్ర అని అభియోగాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications