అది ఏడో వింత: వైయస్ విజయమ్మపై ఈనాడు ధ్వజం

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌లోని శంషాబాద్ విమానాశ్రయ భూముల అంశంపై రామోజీరావుకు చెందిన ఈనాడు ధ్వజమెత్తింది. పచ్చి అబద్దాల్ని ప్రచారంలో పెట్టి ప్రజల కళ్లకు గంతలు కట్టే ఎత్తుగడకు, నిప్పులాంటి నిజాల్ని నిస్సిగ్గుగా దాచడానికి విజయమ్మ పిల్ పరాకాష్ఠ అని ఆరోపించింది. చట్టాల్ని, దర్యాఫ్తు సంస్థల్ని అపహాస్యం చేసే చౌకబారు క్రీడను వైయస్ విజయమ్మ ఆడుతున్నారని పేర్కొంది. అవినీతి ఆరోపణల్లో పీకలోతు బురదలో కూరుకు పోయిన జగన్ వర్గం ఆ బురద ఇతరులకు అంటించేందుకు ఎంతకైనా బరితెగిస్తోందని, వినామాశ్రయం ఏర్పాటుకు సంబంధించి వారు అబద్దపు ప్రచారాలు, పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్సించింది.

రామోజీరావుకు, మరికొందరికి లబ్ధి చేకూర్చడానికే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్‌లో ఏర్పాటు చేశారన్న వైయస్సార్ కాంగ్రెసు నేతల వాదనను తప్పు పట్టింది. ఈ అంశంపై విజయమ్మ భర్త దివంగత వైయస్ జరిపించిన సిబిఐ విచారణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిగ్గు తేలిందని, అయితే ఆ నివేదిక వైయస్ హయాంలో వెలుగు చూడలేదన్నారు. ఇప్పటి దాకా ఇది రాష్ట్ర ప్రజల దృష్టికి రాలేదన్నారు. వైయస్ ఏ అంశంపై విచారణ జరిపించారో, అదే అంశంపై అదే విచారణ సంస్థతో దర్యాఫ్తు జరిపించాలని వైయస్ విజయమ్మ హైకోర్టును ఆశ్రయించడం ప్రపంచంలో ఏడో వింత అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు కోసం బహిరంగ ప్రకటన అయిన మూడేళ్ల తర్వాత రామోజీ పాలమాకులలో మైహోమ్స్ సంస్థల నుంచి భూములు కొన్నారని ఆ లెక్కన విమానాశ్రయ ఏర్పాటు దృష్టితో ముందుగానే భూములు కొన్నారన్న ఆరోపణల్లో పస లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+