కీలక సూత్రధారి కెవిపి: గనుల లీజుపై తపాల్ శ్యాంప్రసాద్

KVP Ramachandra Rao
హైదరాబాద్: గాలి గనుల కేసు మొత్తానికీ అసలు సూత్రధారి అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావేనని మైనింగ్ లీజుదారుడు తపాల్ శ్యాంప్రసాద్ ఆరోపించారు. న్యాయవ్యవస్థను కూడా ఆయన ప్రలోభపెట్టారన్నారు. రాజగోపాల్, శ్రీలక్ష్మి, సబిత పనిముట్లు మాత్రమేనని, అందరూ కేవీపీ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నారని అన్నారు. తపాల్ శ్యాంప్రసాద్ ప్రకటనను ఆంధ్రజ్యోతి దినపత్రిక అచ్చేసింది. "18వ తేదీ జీవో జారీ చేశారు. 19న దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. 20వ తేదీన పర్మిట్లు ఇచ్చారు. దేశంలో ఎక్కడా ఇంత అక్రమం జరిగి ఉండదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే జీవో నెం.151పై తాను హైకోర్టుకు వెళ్లానని, ఈ విషయంలో ప్రభుత్వం చేసింది తప్పని కోర్టు కూడా చెప్పిందని వివరించారు.

తాను చెబుతున్నదానిపై కాణిపాకం దేవస్థానంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. లీజుల్లో అక్రమాలపై 2006లో రాజగోపాల్‌పైనా, ఆయన బావమరిదిపైనా అనంతపురం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, కేవీపీ పలుకుబడితో తన కేసును పోలీసులు నమోదు చేసుకోలేదని తెలిపారు. తర్వాత మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు కేసు వేస్తే 155 (3) కింద కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా మెజిస్ట్రేట్ వన్‌టౌన్ పోలీసులను ఆదేశించారని తెలిపారు. అలాగే, తన లీజు దరఖాస్తుకు సంబంధించి న్యాయం చేయాల్సిందిగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కోరగా వారం తర్వాత రమ్మన్నారని, సర్వే నెంబర్ 1, 2 మల్కనగుడి ప్రాంతానికి నోటిఫై చేసి వేరే చోట ఇచ్చారని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి గెలిచానన్నారు. కోర్టులో గెలిచినా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆవేదన వెలిబుచ్చారు. గాలి ఆరెస్టుకు ముందు తాను మూడుసార్లు సీబీఐ వద్దకు వెళ్లి సాక్ష్యం చెప్పానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+