2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో చండోలియాకు బెయిల్

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు, హైకోర్టు ఇప్పటికే 11 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేశాయని, విచారణకు చాలా సమయం పడుతుందుని, వారితో సమానంగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటి మంత్రి ఆదేశాలను మాత్రమే చండోలియా పాటించారని, చండోలియాపై ఆరోపణలు నిరాధారమైనవని ఆయన తరఫు న్యాయవాది కోర్టు ముందు చెప్పారు. స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ ఉస్మాన్ బాల్వాకు సిబిఐ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి, తదితరులు ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications