జైలుకు వద్దు, సిబిఐ కార్యాలయంలో ఉంటా: శ్రీలక్ష్మి

శ్రీలక్ష్మికి ఈ నెల 12వ తేదీ వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. తన ఆరోగ్యం బాగా లేదని, బెయిల్ ఇవ్వండి లేదా సిబిఐ కార్యాలయంలోనే ఉండేలా ఆదేశాలు ఇవ్వండని శ్రీలక్ష్మి చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. తమ కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు శ్రీలక్ష్మిని గురువారం కోర్టు ముందు హాజరు పరిచారు. శ్రీలక్ష్మిని చంచల్‌గుడాలోని మహిళా జైలుకు తరలించారు. జైలులో శ్రీలక్ష్మికి వైద్య సదుపాయాలు కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, శ్రీలక్ష్మి దొంగ వైద్య సేవల సర్టిఫికెట్లు తెచ్చారని సిబిఐ ఆరోపించింది.
తాను ఎవరి నుంచీ డబ్బు డిమాండ్ చేయలేదని, అక్రమ మైనింగ్‌లో తన పాత్ర లేదని శ్రీలక్ష్మి చెప్పారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలకు అనుగుణంగానే గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా జీవోలు జారీ చేసినట్లు, మంత్రి పదే పదే ఫోన్లు చేసి విసిగించారని, మంత్రి ఫోన్లు చేసినట్లు తన వద్ద ఆధారాలు లేవని శ్రీలక్ష్మి కోర్టు ముందు చెప్పారు. కాప్టివ్ అనే పదాన్ని తొలగించినట్లు తాను చూడలేదని, జీవోపై తాను సంతకం చేయలేదని శ్రీలక్ష్మి చెప్పారు.












Click it and Unblock the Notifications