ఎమ్మెల్యేల చర్చలు, హైదరాబాదుకు వైయస్ జగన్

కాగా, గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. ఆయన తన వర్గానికి చెందిన శానససభ్యులతో చర్చలు జరిపే అవకాశాలున్నాయి. శని, ఆదివారాలు కూడా శాసనసభా సమావేశాలు జరుగుతుండడంతో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ శానససభ్యులతో చర్చలు జరుపుతారు. తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల తన వర్గం శాసనసభ్యులు అనర్హత వేటుకు కూడా సిద్ధపడి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేలా చూడాలని ఆయన అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications