చిరంజీవిని బుజ్జగిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

Chiranjeevi-Kiran Kumar Reddy
హైదరాబాద్: తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెసు నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను గడ్డిపోచల్లా చూస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శానససభ్యులు చిరంజీవి వద్ద తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఈ స్థితిలో తన వర్గం శానససభ్యులతో చిరంజీవి రేపు ఆదివారం అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన 17 మంది శాసనసభ్యులకు కాంగ్రెసు జారీ చేసే విప్ వర్తించదు. దీంతో అవిశ్వాసంపై ఓటింగు సందర్భంగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఏ కొద్ది మంది జారిపోయినా ప్రభుత్వం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. దీంతో కాంగ్రెసు కలవరానికి గురవుతోంది.

ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేసేలా చూడాలని ఆయన చిరంజీవిని అభ్యర్థించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుడు కన్నబాబును పిలిపించుకుని మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యుల సంఖ్య ఓ వైపు కలవరానికి గురి చేస్తుండగా, మరో వైపు చిరంజీవి కొత్త చిచ్చును రాజేశారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల్లో నెలకొన్న అసంతృప్తిని వైయస్ జగన్ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వానికి గ్యారంటీగా కష్టకాలం వచ్చినట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+