సిఎం జోక్: టిడిపి చిరునవ్వు, పోలిక వద్దంటూ కౌంటర్

అంతకుముందు రఘువీరా రెడ్డిపై విరుచుకుపడిన చంద్రశేఖర్ పైన సిఎం అసహనం వ్యక్తం చేశారు. రఘువీరాకు డాక్టరేట్ వస్తే మీకు ఇష్టం ఉంటే అభినందించండి లేదంటే ఊరుకోండి అంతేకానీ ఇలా ఎద్దేవా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల విషయంలో టిడిపి తమతో పోలిక పెట్టుకోవద్దన్నారు. అలా అయితే మీకే ఇబ్బందులు వస్తాయన్నారు. మేం ధైర్యంగా మాది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్నామని కానీ టిడిపి తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడైనా రైతు ప్రభుత్వమని చెప్పుకుందా అని ప్రశ్నించారు.
వ్యవసాయ రంగం తీవ్ర నష్టాల్లో ఉన్న మాట వాస్తవమే అన్నారు. రాష్ట్రంలో పశుగ్రాసానికి కొరత వచ్చే ప్రమాదముందన్నారు. రైతులకు కేంద్రం రూ.4వేలు ఇస్తుంటే తాము రూ.6వేలు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. అయినా రైతులకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు.












Click it and Unblock the Notifications