చిరంజీవితో మాట్లాడా, వారితో ఇబ్బంది లేదు: సిఎం

పంచాయతీరాజ్ వ్యవస్థపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశానని, తొలి త్రైమాసికంలోనే ఈ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. స్థానిక సంస్థలు, నగరపాలక చైర్మన్లు, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉందని, పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో ఇప్పుడు అమల్లో ఉన్న అయిదంచెల స్థానంలో తిరిగి మూడంచెల విధానాన్ని ప్రవేశ పెడతామని చెప్పారు.
కాగా తెలుగుదేశం పార్టీపై దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముప్పయ్యేళ్లు అలుపెరగని పోరాటం చేశారని, వైయస్ రాజారెడ్డి హత్యలో ఆ పార్టీ హస్తముందని అలాంటి టిడిపి అవిశ్వాసం పెడితే మేం ఎలా మద్దతిస్తామని ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications