చరిత్రహీనుడు: చిరంజీవిని కడిగి పారేసిన వాసిరెడ్డి పద్మ

vasireddy padma
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారం కడిగి పారేశారు. ప్రజా వ్యతిరేక, రైతుల సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దద్దమ్మ ప్రభుత్వాన్ని కాపాడటాన్ని ఓ ఘనతగా, పవిత్రకార్యంగా చిరంజీవి చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయాల్లో మార్పు, సామాజిక న్యాయం తెస్తానని పీఆర్పీని స్థాపించి బడుగు, బలహీనవర్గాల ప్రజలకు భ్రమలు కల్పించిన చిరంజీవి తన పార్టీని గంపగుత్తగా కాంగ్రెసులో విలీనం చేసి చరిత్రహీనుడిగా మిగిలారని విమర్శించారు. ప్రజలపట్ల తన బాధ్యత విస్మరించి ప్రభుత్వాన్ని కాపాడటం బాధాకరమని, రెండు మంత్రు పదవుల కోసం బేరసారాలు సాగించి ప్రభుత్వానికి మద్దతివ్వడం సమంజసం కాదన్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజీ పొందడానికి బేరసారాలు సాగించి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించి ఉండే వారని, పదవిని కాపాడుకోవడంలో మునిగితేలుతున్న కిరణ్‌కు ఎలాగూ తీరిక లేదని కనీసం చిరు అయినా సోనియాతో మాట్లాడి రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిస్తే బావుండేదన్నారు. ఆయన మంత్రి పదవుల కోసం తాపత్రయ పడ్డారని విమర్శించారు. ప్రజల విశిష్ఠ ఆదరణ పొంది ఇప్పుడు ప్రజలకు ఏమీ చేయలకపోవడం విశేషం. పిఆర్పీని విలీనం చేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి పునీతమైనట్లుగా భావించడం సరికాదన్నారు. శోభా నాగి రెడ్డిపై అనర్హత నోటీసు ఇచ్చే
అధికారం చిరుకు లేదన్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలలో ఘన విజయం సాధిస్తారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎవరు రాజకీయ విలువలు దిగజార్చారో, ఎవరు ప్రలోభ పెట్టారో అందరికీ తెలుసునని సిఎంను ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+