బిల్లు కోసం మళ్లీ జైలుకెళ్లేందుకు సిద్ధం: అన్నాహజారే

సిబిఐని లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. పటిష్ట బిల్లు తెచ్చే వరకు తన ఆందోళన కొనసాగుతుందన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలన్నారు. లోక్‌పాల్‌పై జంతర్ మంతర్ వద్ద బహిరంగ చర్చ జరగాల్సిందేనన్నారు. రాజకీయాలు పూర్తిగా నేరపూరితమైపోయాయని వాటికి వ్యతిరేకంగా ఉధృతంగా పోరాటం చేయాలన్నారు. రాజకీయాల్లో అందరూ అవినీతిపరులు కారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు నాయకులు కారన్నారు.
జాతి సంపదను పాలకులే మింగేస్తున్నారని ఆరోపించారు. అసమర్థ, అవినీతి రాజకీయ నాయకులను రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలన్నారు. ప్రజలు ఉద్యమిస్తే కేంద్రం బలమైన లోక్‌పాల్ బిల్లు తీసుకు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications