బాబుకు క్లీన్ చిట్ లేదు: విజయమ్మ లాయర్, విచారణ వాయిదా

కోర్టు చెప్పిన మూడు నెలల గడువులు ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయన్నారు. హైకోర్టు ఆదేశించింది ఆయన ఆస్తులపై విచారణ మాత్రమేనని దర్యాఫ్తు కాదన్నారు. సిబిఐ కేవలం ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే అడుగుతోందన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చి నెలరోజులు కావస్తుందని కాబట్టి ఇప్పటికైనా విచారణ జరపాలన్నారు. బాబు తన హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. కాగా ఈ కేసులో విజయమ్మ తరఫు న్యాయవాది వాదనలు పూర్తయ్యాయి.
అనంతరం ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. వైయస్ విజయమ్మ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని, జగన్‌పై సిబిఐ దర్యాఫ్తు జరుపుతున్న ఈ సమయంలో కేవలం రాజకీయ కక్షతోనే వేశారని ఆరోపించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలను వెంటనే ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలని కోరారు. అనంతరం కేసు విచారణనను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications