హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఆస్తులపై విచారణ జరపాలి: మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupally Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని టిడిపి సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం అన్నారు. కెసిఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మె పేరుతో కెసిఆర్ కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నారని ధ్వజమెత్తారు. సమ్మెను సంపదగా మార్చుకున్నారన్నారు. విచారణ జరిపి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అమరవీరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు.

దొంగతనంగా, అక్రమంగా సంపాదించిన కేసిఆర్ ఆస్తులు బయటకు రావాలన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ కెసిఆర్ ఏజెంటుగా మారారని విమర్శించారు. తెలంగాణ ముసుగులో తమ పార్టీ నేతలపై టిఆర్ఎస్ దాడులు చేస్తుందని విమర్శించారు. కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ విధానాలు చెప్పకుండా మంత్రులు ఇబ్బందులను ఏకరువు పెట్టారని, ప్రజా సమస్యల ప్రస్తావనే లేదని ఆరోపించారు.

English summary
TDP senior MLA Mothkupalli Narasimhulu demanded to enquiry on TRS chief K Chandrasekhar Rao properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X