ఈడి నుండి జగన్‌కు పిలుపు, 20న హాజరు?

ys jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ నెల 20వ తేదిన తమ ముందు హాజరు కావాలని ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సాక్షి మీడియా సహా జగన్ సంస్థల్లోకి విదేశీ నిధుల ప్రవాహంపై సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డి ఇప్పటి వరకు ఈడి ముందు హాజరయ్యారు. అయితే ఆయన వివరణతో ఈడి సంతృప్తి చెందక పోవడం వల్లనే జగన్‌ను స్వయంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలకు ఒకటి రెండు హాజరయ్యేందుకు జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆయన పార్లమెంటు సమావేశాలకు మాత్రమే కాకుండా ఈడి 20వ తేదిన ఈడి ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలకు హాజరు పేరుతో జగన్ ఈడి ముందు హాజరయ్యేందుకే ప్రత్యేకంగా వెళుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా జగన్ గ్రూపు సంస్థలలోకి విదేశీ పెట్టుబడులు వచ్చిన వైనంపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఈడి, నవంబర్ 22లోగా తమవద్దకు వచ్చి వివరాలివ్వాలని లేదా ఎవరైనా ప్రతినిధితో వివరాలు, పత్రాలు పంపాలని నవంబర్ మొదటి వారంలో జగన్‌ను ఆదేశించింది. దీంతో విజయ సాయిరెడ్డి ఇప్పటికి నాలుగుసార్లు ఈడి ఎదుట హాజరై వివరణతో పాటు పలు పత్రాలను అందజేశారు. కానీ ఆయన వివరణతో ఈడి సంతృప్తి చెందనట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+