వైయస్ జగన్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు: చంద్రబాబు

కెసిఆర్ ఎక్కడినుంచో ఊడిపడలేదని, తాము మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కెసిఆర్ బయటకు వెళ్లి పార్టీ పెట్టారని ఆయన అన్నారు. రాజం, కెసిఆర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయి పోలవరం టెండర్లు దక్కించుకోవడానికి ప్రయత్నించారని ఆయన విమర్శించారు. పోలవరం టెండర్లకు సంబంధించిన ఫైళ్లను స్పీకర్ వద్ద ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నాగం జనార్దన్ రెడ్డికి చాలా గౌరవం ఇచ్చామని, దాన్ని నాగం కాపాడుకోలేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగే పరకాల శాసనసభా స్థానానికి ధర్మారెడ్డిని, స్టేషన్ ఘనపూర్ సీటుకు కడియం శ్రీహరిని ఆయన అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
ఒంగోలు టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎన్నికపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications