కాంగ్రెసు రాజకీయ చదరంగంలో చిరంజీవి పావు?

తన 17 మంది శానససభ్యులతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిలబెట్టిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. అయితే, ఆ సమయంలో అలక వహించి, కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో బతిమాలించుకోవడం వల్ల చిరంజీవి ప్రతిష్ట కొంత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి బొత్సపైనే కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. చిరంజీవిని బొత్స సత్యనారాయణ ఎగేశారని, అందువల్లనే చిరంజీవి బెట్టు చేశారని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.
బొత్స సత్యనారాయణ తరుచుగా చిరంజీవితో సమావేశమవుతూ తాను మాత్రమే సన్నిహితుడిని అనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా చిరంజీవిని బుట్టలో వేసుకున్నట్లు సమాచారం. చిరంజీవితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూనే తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని, చిరంజీవిని పక్కకు తప్పించాలని వ్యూహం పన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు రాజకీయాల్లో చిరంజీవితో పాటు ఆయన శాసనసభ్యులు కూడా తీవ్ర నిరాశకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని వాడుకుంటూ అలా వదిలేస్తారా, తగిన స్థానం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications