ఎవరి ఒత్తిడి లేదు: జగన్ క్యాంప్ ఎంపి మేకపాటి

వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ చార్జిషీట్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని తాను స్పీకర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. వైయస్సార్ పేరును సిబిఐ చార్జిషీట్‌లో చేర్చడం వల్ల రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తిన్నదని ఆయన చెప్పారు. అంతకు ముందు ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. జగన్‌తో కలిసి ఆయన పార్లమెంటుకు వెళ్లారు. కాగా, పార్లమెంటు సమావేశాలను పొడగించారు. పార్లమెంటు ఈ నెల 27, 28, 29 తేదీల్లో మళ్లీ పార్లమెంటు సమావేశం కానుంది.












Click it and Unblock the Notifications