శబరిమల సంప్రదాయాలకు ఆంధ్ర మహిళ భంగం

సరస్వతి అనే మహిళ 18 మెట్లను కడిగి ప్రధాన ఆలయాన్ని కూడా శుద్ధి చేసినట్లు ఆలయ యంత్రాంగం తెలిపింది. ప్రధాన పూజారి ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వివరించారు. సరస్వతి ప్రధాన ఆలయంలో పూజలు చేసుకుని, తర్వాత మల్లికాపురం ఉపాలయానికి వెళ్తుండగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆమెను గుర్తించారు. వారు ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే వాళ్లు కేసు ఏమీ నమోదు చేయకుండా పంపేశారు. తాను యుక్తవయసులో ఉండగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, స్వామి విగ్రహాన్ని ముట్టుకున్నట్లు కన్నడ నటి జయమాల 2006లో ప్రకటించి సంచలనం సృష్టించారు. దాంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు - నిరుడు కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేరళ హైకోర్టు గత సంవత్సరం అక్టోబర్‌లో స్టే విధించింది.












Click it and Unblock the Notifications