వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో ఉండవల్లి గీతాబోధ, శ్లోకాలతో కట్టిపడేసిన వైనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ: భగవద్గీతలోని నిగూఢ రహస్యాలను భారతీయులు మాత్రమే అర్థం చేసుకోగలరని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం లోక్‌సభలో అన్నారు. భగవద్గీతను నిషేధించాలని రష్యాలో వేసిన కేసును ఆయన తప్పు పట్టారు. శంకరాచార్య, తిలక్, రాధాకృష్ణన్ వరకు ఒక్కరొక్కరు ఒక్కోలా గీతను విశ్లేషించారని అది మనమే అర్థం చేసుకోగలమన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి విపక్ష సభ్యులకు గీతాబోధ చేశారు. రష్యాలో భగవద్గీతను నిషేధించడంపై ఇక్కడ నిరసన తెలుపుతున్నాం కానీ గీతలో చెప్పిన దాన్ని మనం పాటిస్తున్నామా? అని ప్రశ్నించారు.

శ్రేష్టులు చెప్పిన దాన్ని మరోపాట లేకుండా పాటించాలని గీతలో ఉంది, కానీ పార్లమెంటు నిబంధనల ప్రకారం మనం నడుచుకుంటున్నామా? 120 కోట్ల జనాభా సమస్యల్ని చర్చించాల్సిన సభ్యులు చర్చను మానేసి రోజూ పార్లమెంటును అడ్డుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు శ్లోకాలు పాడి వాటిని వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.

English summary
Rajahmundry MP Undavalli Arun Kumar take a lesson to Parliament Members on Bhagavad Gita on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X