బొత్స సత్యనారాయణ ఉచ్చులో చిరంజీవి: అంబటి

కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడానికి తాను వ్యతిరేకమని శోభా నాగిరెడ్డి ఆనాడే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని శోభా నాగిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు కూడా చెప్పారని ఆయన అన్నారు. అలాంటప్పుడు శోభానాగిరెడ్డికి విప్ జారీ అధికారం ప్రజారాజ్యం పార్టీకి ఎలా ఉంటుందని ఆయన అడిగారు. వారి ప్రవర్తన చూస్తుంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ వ్యతిరేక ఓట్లతో ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు గెలిచారని ఆయన అన్నారు. శోభా నాగిరెడ్డి ప్రజల పక్షాన ఉన్నారని, చిరంజీవి వాస్తవాలు తెలుసుకోవడం మంచిదని ఆయన అన్నారు.
మద్యం అమ్మకాలకు కొత్త విధానం రూపొందిస్తున్నట్లు చెబుతున్నారని, ముఖ్యమంత్రికి నేరుగా ముడుపులు చెల్లించేదే ఆ కొత్త విధానమని ఆయన వ్యాఖ్యానించారు. అందుకోసమే ఎసిబి దాడులు చేశారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేసినా కూడా ఎంఆర్‌పి రేట్ల కన్నా ఎక్కువకు విక్రయిస్తున్నారని ఆయన చెప్పారు. ఎసిబి దాడుల వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్స సత్యనారాయణపై, ఇతర మంత్రులపై ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications