ప్రమాదాల నివారణకు మాస్టర్ ప్లాన్: సబితా ఇంద్రారెడ్డి

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు మంగళవారంనాడు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అత్యవసర ప్రాతిపదికపై హోం మంత్రి సీనియర్ పోలీసు అధికారులతో బుధవారంనాడు సమీక్ష చేపట్టారు. రహదారులపై తగిన రక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బుధవారంనాడు పోలీసు ఉన్నతాధికారులతో ఈ విషయమై సమావేశమయ్యారు. అదనపు డి.జి.పి. సహా సీనియర్ పోలీసు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఔటర్ రింగు రోడ్డులో జరిగిన ప్రమాదాలలో గత ఏడాది కాలంలో ఎంతో మంది మరణించడం పట్ల హోం మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ సేఫ్టీ విషయంలో ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకోవాలని హోం మంత్రి ఈ సమావేశంలో సూచించారు. ఈ అంశాన్ని ఉపేక్షించరాదని అంటూ హై వేస్ రక్షణకు పక డ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు. ఔటర్ రింగురోడ్డులో వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవడం గురించి కూడా ఈ సమావేశంలో కొన్ని సూచనలు వచ్చాయి.












Click it and Unblock the Notifications