బొత్స సత్తిబాబును కిరణ్ కుమార్ రెడ్డి కట్టడి చేస్తారా?

Botsa Satyanarayana and CM Kiran Kumar Reddy
హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కట్టడి చేసి, ఆయన దూకుడు కళ్లెం వేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనను విఫలం చేసి, లేదా తాను విఫలమయ్యానని అనిపించి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి అనుమానిస్తున్నారని అంటున్నారు. పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత కూడా మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ప్రభుత్వ యంత్రాంగంపై కూడా తానే పట్టు సాధించాలని బొత్స సత్యనారాయణ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, కాంగ్రెసులోకి వచ్చిన చిరంజీవిని కూడా అందుకు పావుగా వాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తాజాగా బుధవారంనాడు అదే వ్యాఖ్య చేశారు.

బొత్స సత్యనారాయణను కేవలం గాంధీభవన్‌కే పరిమితం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు ఆయన మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు చేసిన దాడులను, ఎసిబి ఇచ్చిన నివేదికను ఆయన బొత్స సత్యనారాయణను కట్టడి చేయడానికి వాడుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణకు మద్యం సిండికేట్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలో నేపథ్యంలో బొత్స సత్యనారాయణ కాస్తా ఆత్మరక్షణలో పడినట్లు చెబుతున్నారు. దీని నుంచి బయటపడడానికే ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

మద్యం సిండికేట్లతో సంబంధాలున్నవారి పేర్లను బయటపెట్టాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సంబంధాలు ఉండడం వల్లనే ఆ పేర్లను వెల్లడించడం లేదని కూడా సిపిఐ నేత నారాయణ లాంటి వారు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో బొత్స సత్యనారాయణకు కళ్లెం వేయడానికి ఎసిబి నివేదికను వాడుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+