బందిపోటులా ప్రభుత్వం పనిచేస్తోంది: నారాయణ

మద్యం సిండికేట్ల కుంభకోణంలో ముఖ్యమంత్రికి కిరణ్ కుమార్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు. మంత్రులు కూడా ఇందులో పాలు పంచుకున్నారని, అందుకే మద్యం మాఫియా జాబితాను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో అధికారులు కూడా భాగస్వాములై దోచుకుంటున్నారని ఆయన అన్నారు. మద్యం మాఫియాపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష దాడులకు దిగుతామని ఆయన హెచ్చరించారు. పదవిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. సమాంతర ప్రభుత్వాన్ని మద్యం మాఫియా ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications