ప్రతీక్ అంత్యక్రియలు: బోరున విలపించిన కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదంలో మరణించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఎర్రగడ్డ ఈఎస్ఐ స్మశానవాటికలో పూర్తయ్యాయి. కుమారుడు మృతిని తట్టుకోలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోరున విలపించారు. ఆయనను ఊరడించడం ఎవరికీ సాధ్యం కాలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం శోకసముద్రమే అయింది. ప్రతీక్ అంత్యక్రియలకు పెద్ద యెత్తున బంధుమిత్రులు, రాజకీయ నాయకులు, అబిమానులు తరలి వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండెలు బాదుకుంటూ విలపించడం అందరినీ కలచివేసింది.

ప్రతీక్ రెడ్డి అంత్యక్రియలకు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి్, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు జానా రెడ్డి, శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, సిపిఎఁ నేత నోముల నరసింహయ్య, సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి వచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓదార్చడానికి వారు తీవ్రంగా ప్రయత్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+