విస్తృత ఏకాభిప్రాయం కావాలి: తెలంగాణపై జితేంద్ర సింగ్

ఏ కొత్త రాష్ట్ర ఏర్పాటు అయినా విస్తృత ప్రబావాలు చూపుతాయని, దేశ ఫెడరల్ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. మాతృ రాష్ట్రం నుంచి విస్తృత ఏకాభిప్రాయం వస్తేనే అటువంటి విషయాలపై కేంద్రం ముందుకు కదులుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పలు అంశాలను, పద్ధతులను సమీక్షించడానికి వేసిన శ్రీకృష్ణ కమిటీ గత డిసెంబర్‌లో నివేదిక సమర్పించిందని ఆయన చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల విభజనకు తన 500 పేజీల నివేదికలో కమిటీ పలు ప్రత్యామ్నాయాలను సూచించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications