హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్ నోటీసులకు జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు బేఖాతరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pilli Subhas Chandra Bose
హైదరాబాద్: స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వకూడదని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు నిర్ణయించుకున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ 16 మంది శాసనసభ్యులపై కాంగ్రెసు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 29వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆ 16 మందికి నోటీసులు జారీ చేశారు. స్పీకర్ సాక్షిగానే విప్‌ను ధిక్కరించి ఓటు వేసినందున నోటీసులకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ వర్గం శానససభ్యులు అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

స్పీకర్ సాక్షిగానే తాను పార్టీ విప్‌ను ధిక్కరించి తాను ఓటేశానని, అందువల్ల నోటీసుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సమావేశానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలను జాప్యం చేసేందుకే స్పీకర్ తమను వివరణ కోరుతున్నారని ఆయన విమర్శించారు. మార్చిలోనే ఉప ఎన్నికలను నిర్వహించాలని ఆయన అన్నారు.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయాలని జగన్ ఆదేశించారు. జాతీయ వ్యవసాయ దినోత్సవం సందర్బంగా రేపు సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం జనవరి 4వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని నిర్ణియించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారు.

English summary
YSR Congress president YS Jagan camp Congress MLA have decided not to reply to Speaker notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X