తెలంగాణలో మూడు సీట్లపై కన్నేసిన ముఖ్యమంత్రి

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మూడు సీట్లపై కన్నేసినట్లు సమాచారం. తెలంగాణలోని ఆరు శానససభా నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో కనీసం మూడు సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై ఇంకా అనర్హత వేటు పడలేదు కాబట్టి ఈ ఆరు సీట్లతో పాటు వారి సీట్లకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని అంటున్నారు. తొలుత తెలంగాణలోని ఆరు సీట్లకు ఉప ఎన్నికలను ఎదుర్కోవాలనే వ్యూహంతోనే కాంగ్రెసు పనిచేస్తోందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 26వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెసు పార్టీ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా హాజరవుతారు. జిల్లాలోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు రానున్నాయి. కొల్లాపూర్, నాగర్ కర్నూలు, మహబూబ్‌నగర్ సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడింటిలో 2009 ఎన్నికల్లో కాంగ్రెసు కొల్లాపూర్‌లో విజయం సాధించింది. ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. దీంతో దీనికి ఉప ఎన్నిక జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో నాగర్ కర్నూలుకు, శాసనసభ్యుడు రాజేశ్వరరెడ్డి అకస్మిక మృతితో మహబూబ్‌నగర్‌కు ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. అన్ని స్థానాలకు పోటీ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు.

ఈ నెల 26వ తేదీన జరిగే సమావేశంలో టికెట్ అశిస్తున్న నాయకుల విజయావకాశాలను, సర్వేల ద్వారా అందిన సమాచారాన్ని బేరీజు వేయనున్నట్లు తెలుస్తోంది. చివరి బంతి వేసే వరకు మ్యాచ్ అయిపోయినట్లు భావించకూడదని ముఖ్యమంత్రి పార్టీ నాయకులకు ఇప్పటికే చెబుతున్నారని సామాచారం. ప్రత్యర్థుల కన్నా దూకుడుగా వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+